మంత్రాలయ మందిరము
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
సంగీతం: ఉపేంద్ర కుమార్
పల్లవి:
హరిపరేశుని
పంచమూర్తులకు ఆలయము
గురువరేణ్యుని
రాఘవేంద్రునీ మందిరము
పరమభట్టుల దర్శనంబిటా కలుగును
ధరను వెలిసెడి క్షేత్రరాజమిది మంచాల
చరణం 2:
కన్నడరాయని గాచిన గురురాజా
అన్నమిడి ఆదరణ మొసగిన యతిరాజా
చిన్నారి గురురాజ శ్రీమంత్రపురి రాజ
ఏనాడు దయగల్గు ద్విజరాజ రారాజ
చరణం 3:
మంగళప్రద నేడు
మంత్రాలయము గంటి
తుంగభద్రలొ మునిగి
తొలిసారి నినుగంటి
బంగారు దొర వీవు
కంగారు నాకేల...?
వంగితిని రవితేజ
వరమిమ్ము సురభోజ
చరణం 4:
లక్షాధిపతి నాడె
రజత రథమిదె నీకు
బిక్షుకాగ్రణి నేడు
హేమకవచము తొడిగె
రక్షకుడు హరి నీకు
రాజ్యపాలన నిచ్చె
యక్షాధిపతి వీవు
అమరాధికుడ వీవు
చరణం 5:
ప్రణవార్ధమును గూడ
బాల్యమున పలికేవు
ఘన వేదతతికి
భాష్యమును వ్రాసేవు
నిను బోలు విబుధుఁడు
గనరాడు భువిలోన
వీణ వేంకట భక్త
విజయమ్ము జేజేలు
చరణం 6:
భక్తులారా...
రాఘవేంద్రునీ భజియింప
ముక్తినిచ్చుము నిపుడు
మోద మతచందురుడు
సత్యధర్మ నిరతుడు
శాంతమూర్తీ అతడు
భృత్యజనులకు
భోగభాగ్యముల నిచ్చు...