మోగదు రాగం
తపస్సు (1995)
గానం: మాల్గాడి శుభ
సంగీతం: రాజ్-కోటి
రచన: వెన్నెలకంటి
తపస్సు (1995)
గానం: మాల్గాడి శుభ
సంగీతం: రాజ్-కోటి
రచన: వెన్నెలకంటి
పల్లవి:
మోగదు రాగం శూన్యంలో
వెలగదు గగనం గ్రహణంలో
అడవిని కాచే వెన్నెల నాది
ఆశలు రాలే ఆమని నాది
పగిలిన ఈ నావ తీరమేదీ
చరణం:
ఋణమే తీరి వెళితే అమ్మ
కన్నుల మిగిలే ఆరని చెమ్మ
వేదన మాత్రం వ్రాసెను బ్రహ్మ
మంటగ రగిలే ఒంటరి జన్మ
కాలం చేసిన
గాయం మానదు
చీకటి బ్రతుకులలో
లోకం చేసిన
లోకువ మారదు
మమతను ఎరుగక
చెదిరిన మనసులలో