November 15, 2020

అపనా తన్నామన్నా


అపనా తన్నామన్నా 
చుట్టాలున్నారు జాగ్రత్త  (1980)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్  
రచన: కొసరాజు  
గానం: బాలు  

పల్లవి: 

అపనా తన్నామన్నా
అందరికి దండాలన్నా 
తాగినోడి నోట నిజం 
తన్నుకుని వస్తాదన్నా 
చరణం 1:

ఏలేవాడిది ఎద్దుబోయినా 
కాసేవాడిది కన్నుబోయినా 
నీకూ నాకూ తరుగేముంది? 
లోకంతో ఇక పని ఏముంది?
ఉన్నమాట అన్నారోరన్నో చిన్నన్న 
నేనన్న మాట ఔననరోరన్నో చిన్నన్న 

చరణం 2:

నీవు మునిగినది గంగే  కదరా 
నేను మెచ్చినది రంభే కదరా 
కాదని ఎవ్వరు వాదమాడినా 
ఖండఖండములు చేద్దాం పదరా 
చూసుకో రాజా 
నా తడాఖ ఎదో 
చూపుతా రాజా 

చరణం 3:

కల్ల నిజమౌతుంది 
బూతు నీతౌతుంది 
దేశమే కల్లోలమౌతుందయా 
వేషాలు మార్చేటి మోసగాళ్ళందర్ని 
కనిపెట్టడం కష్టమౌతుందయా 
నమ్మాలిరా బాబు నమ్మాలిరా
గురుడు చెప్పిన మాట నమ్మాలిరా
ఈ గురుడు చెప్పిన మాట నమ్మాలిరా