November 13, 2020

సిగ్గాయెనమ్మో...

సిగ్గాయెనమ్మో... 
కుడి ఎడమైతే (1979)
రమేష్ నాయుడు 
జానకి 

పల్లవి: 

సిగ్గాయెనమ్మో 
ఆయెనమ్మో...
సిగ్గాయెనమ్మో 
ఆయెనమ్మో  నా చెంగునే పేరే వాడు 
చేరుకుంటాడంటే 
అది నే తలుసుకుంటే 
తలుసుకుంటే తలుసుకుంటే... 
సిగ్గాయెనమ్మో 
ఆయెనమ్మో 

చరణం 1:

సూది మెరుపల్లె నను వాడు చూస్తుంటే 
వాన చినుకల్లె నను పలకరిస్తుంటే.. 
సూది మెరుపల్లె నను వాడు చూస్తుంటే 
వాన చినుకల్లె నను పలకరిస్తుంటే.. 
అది నే తలుసుకుంటే 
తలుసుకుంటే తలుసుకుంటే...
సిగ్గాయెనమ్మో 
సిగ్గాయెనమ్మో
ఆయెనమ్మో 

చరణం 2:

ఏది ఇస్తావా నే కోరుకుందంటే 
అడిగి చూస్తాను నా పెదవినంటుంటే 
ఏది ఇస్తావా నే కోరుకుందంటే 
అడిగి చూస్తాను నా పెదవినంటుంటే
అది నే తలుసుకుంటే 
తలుసుకుంటే తలుసుకుంటే... 
సిగ్గాయెనమ్మో 
సిగ్గాయెనమ్మో
ఆయెనమ్మో 

చరణం 3:

బుగ్గ కాదమ్మి దానిమ్మ మొగ్గంటే 
ముద్దులో కరిగి పోవాలి సిగ్గంటే 
బుగ్గ కాదమ్మి దానిమ్మ మొగ్గంటే 
ముద్దులో కరిగి పోవాలి సిగ్గంటే 
అది నే తలుసుకుంటే 
తలుసుకుంటే తలుసుకుంటే... 
సిగ్గాయెనమ్మో 
సిగ్గాయెనమ్మో
ఆయెనమ్మో 

చరణం 4:

పరుపు కొస మీద నేనొదిగి కూసుంటే 
పడుచు గుబులేదో దడ రేపి పోతుంటే 
పరుపు కొస మీద నేనొదిగి కూసుంటే 
పడుచు గుబులేదో దడ రేపి పోతుంటే 
అది నే తలుసుకుంటే 
తలుసుకుంటే తలుసుకుంటే...
సిగ్గాయెనమ్మో 
సిగ్గాయెనమ్మో
ఆయెనమ్మో