November 26, 2020

మంత్రాలయమే


మంత్రాలయమే     
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

పల్లవి:

మంత్రాలయమే
మాకు దిక్కురా 

రాఘవేంద్రుడే సంరక్షకుడు 

శిరమును వంచితి 
శ్రీ గురురాజా 
సాష్టాంగమయా
సమ్యనివర్యా
 
చరణం 1:

ఆ...
సుధీంద్ర నందన 
నిను జూచితిని 

వాదీంద్ర వాణిని 
పలికితిని 

మూలరాములను కొలిచితివంట 
బాలమురళినే పిలిచితివంట 

చరణం 2:

ఆ...
రాగరోగములు 
వేగమె బాపర
 
భోగభాగ్యములు 
కరుణింపుమురా 

సురతరు, ధేనువు 
నీవేనయా 
వరములొసంగుము  
పరిమళ రాయా