November 26, 2020

భజనా చేయవె మనసా


భజనా చేయవె 
మంత్రాలయ మందిరం (1985)
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్
 
పల్లవి:

భజనా చేయవె మనసా 
నిరతము 
భజనా చేయవె మనసా 
నిరతము

రాఘవేంద్ర గురు 
భజనా చేయవె 
రాఘవేంద్ర గురు 
భజనా చేయవె

భజనా చేయవె మనసా 

చరణం 1:

మంగళకర మంత్రాలయ నిలయుని
భాగవతోత్తమ బ్రహ్మజ్ఞానిని 
బ్రహ్మజ్ఞానిని....

చరణం 2:

కామితమిచ్చెడి కరుణామూర్తిని 
సురనరవంధ్యుని సూరి వరేణ్యుని 
సూరి వరేణ్యుని....

చరణం 3:

నిరుపమసుందర తోజోమూర్తిని 
నరహరిదాసుని వరప్రహ్లాదుని 
వరప్రహ్లాదుని....