November 16, 2020

సింతాసిగురు లాంటి


సింతాసిగురు లాంటి 
చిత్రం : నవ్వుతూ బ్రతకాలి (1975)
సంగీతం :  జి. కె. వెంకటేశ్ 
గీతరచయిత :  దాశరథి
నేపథ్య గానం : బాలు, వేదవతి ప్రభాకర్  

పల్లవి :

సింతాసిగురు లాంటి 
సినదానా...సినదానా
సొగసంతా  నీ వయసంతా 
భలేగ ఉన్నదిలే
అది అంతా నాదేలే
సీమాదొర లాంటి 
చినవాడా... చినవాడా
వలపంతా నీ మనసంతా 
భలేగ ఉన్నదిలే
అది అంతా నాదేలే

చరణం 1 :

కళ్ళనిండా ఆశలేవో తెచ్చాను... 
తీరునని వచ్చాను...

కళ్ళలోనీ ఆశలన్నీ తెలుసునులే... 
తొందరగ తీరునులే

నీ తోడుంటే ఔనంటే 
అంతే చాలునులే... 
అహ.. అంతే చాలునులే...

సింతాసిగురు లాంటి 
సినదానా... సినదానా
సొగసంతా  నీ వయసంతా 
భలేగ ఉన్నదిలే
అది అంతా నాదేలే

చరణం 2 :

కందిరీగా నడుమూ... దాని అందాలు... 
కాళ్ళకవి బంధాలు

కొంటెచూపు పిల్లవాని సరసాలు... 
నామంచి సరదాలు

నా కలలన్నీ నిజమాయే ఇవాళ నీలోనే
హోయ్... ఇవాళ నీలోనే

సీమాదొర లాంటి 
చినవాడా...  చినవాడా
వలపంతా నీ మనసంతా 
భలేగ ఉన్నదిలే
అది అంతా నాదేలే

చరణం 3 :

కొమ్మ మీద కోయిలమ్మలు ఉన్నాయి... 
పాడినవి సన్నాయి

పెళ్ళిపందిట పూలవానలు కురిశాయి... 
దీవెనలు దొరికాయి

మన ఈ జంట కలకాలం 
ఇలాగే ఉండాలి
అహ... ఇలాగే ఉండాలి

సింతాసిగురు లాంటి 
సినదానా...  సినదానా
వలపంతా నీ మనసంతా 
భలేగ ఉన్నదిలే
అది అంతా నాదేలే