November 26, 2020

నిన్ను నమ్మితినయ్యా


నిన్ను నమ్మితినయ్యా 
మంత్రాలయ మందిరం (1985) 
గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
సంగీతం: ఉపేంద్ర కుమార్ 

నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
కన్నతండ్రివీ నీవే 
గురువూ దైవము నీవే 
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర

చిన్న ప్రాయమునందే 
ప్రణవమ్ము పలికేవు 
చిన్న ప్రాయమునందే 
ప్రణవమ్ము పలికేవు 
మున్నూరు నిండినది 
మునిజన చంద్రా 
అన్ని తెలిసిన స్వామీ 
ఔదార్యఖని నీవు 
కొన్నూరు కవి వాణి 
మన్నించు మారాజా 
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర

మంద మానవుని 
మంత్రిని చేయు మహాత్ముడవు 
మంద మానవుని 
మంత్రిని చేయు మహాత్ముడవు 
గంధముతోడనె తాపము 
బాపెడీ... గారడీ... 
నందకుమారుని నాట్యము 
జూచినా తాపసీ 
వందనము గుణసాంద్ర 
శ్రీ మంత్రపురి చంద్రా 
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర

వాదిగజముల పాలి 
మృగరాజా... గురురాజా 
వాదిగజముల పాలి 
మృగరాజా... గురురాజా
మోదసన్నత చంద్ర 
మోసపోయితి తండ్రి 
సాదరమ్మున నీదు 
సంస్మరణ రాదాయే 
మాధవుని దర్శనము 
మాకెట్లు గలుగూను...? 

నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
కన్నతండ్రివి నీవే 
గురువూ దైవము నీవే 
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర
నిన్ను నమ్మితినయ్యా శ్రీ రాఘవేంద్ర