October 16, 2020

కొంగే జారిపోతోందే


కొంగే జారిపోతోందే 
ఘరానా అల్లుడు (1994)
సంగీతం: కీరవాణి, 
రచన: వెన్నెలకంటి,
గానం: చిత్ర, బాలు 

కొంగే జారిపోతోందే అమ్మమ్మో... 
చూపుల్తో ఎవరేం చేశారే...
పొంగే భారమౌతోందే అమ్మమ్మో...
కాపాడే వారెపుడొస్తారే...
చేరక ముందే సెగలే తగిలే
చాటున ఉండే వగలే రగిలే
రాగల రాజెక్కడే... 
హ... హ...

కొంగే జారిపోతోందే అమ్మమ్మో...
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతోందే అమ్మమ్మో...
కాపాడే వారెపుడొస్తారే...

చరణం 1:

వెచ్చంగా... ఒయ్యారం విచ్చంగా 
వరుణ్ణై వచ్చాగా శృంగారమా... 

అచ్చంగా... వయస్సే మెచ్చంగా 
వరించా వాటంగా పురుషోత్తమా...

అపురూపంగా... 
అందించు అభిసారికా... 

అభిమానంగా... 
బంధించు చవితీరగా

'కో'యని కూసే తియ్యని ఊసే

దారులు కాసే తీరని ఆశే,,,

కాముడి కెదురేగగా... 
హ... హ...

కొంగే జారిపోతోందే అమ్మమ్మో...
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతోందే అమ్మమ్మో...
కాపాడే వారెపుడొస్తారే

చరణం 2:

దాహంతో.... దహించే దేహంతో 
తపస్సే చేస్తున్నా... దయచెయ్యవా...

మోహంతో.... ముడేసే మోజుల్లో 
తెగింపే చూస్తున్నా... తెరతియ్యవా...

నువ్వు సై అంటే 
సింగారం ముందుంచనా...

నువ్వు ఊ అంటే 
మొగమాటం వదిలించనా...

కాగల కార్యం జరిగే వరకు

కౌగిలి కోసం ఒకటే పరుగు

కంటికి కునుకుండకా... 
హ... హ...

కొంగే జారిపోతోందే అమ్మమ్మో...
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతోందే అమ్మమ్మో...
కాపాడే వారెపుడొస్తారే