చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: చిత్ర
పల్లవి :
ముద్దులకుడుము ఇస్తా వస్తే
నా ముద్దులగుమ్మా
ఈ మద్దెలమామా దరువే దరువు
నా పుత్తడిబొమ్మా
ముద్దులకుడుము ఇస్తా వస్తే
నా ముద్దులగుమ్మా
ఈ మద్దెలమామా దరువే దరువు
నా పుత్తడిబొమ్మా
బిత్తరపోకే
ఇదంతా నాటకమే
అదంతా బూటకమేలే
ఛలో భామా
బిత్తరపోకే
ఇదంతా నాటకమే
అదంతా బూటకమేలే
ఛలో భామా
ముద్దులగుమ్మా
నా పుత్తడిబొమ్మా
భలె భలె
ముద్దులకుడుము ఇస్తా వస్తే
నా ముద్దులగుమ్మ
ఈ మద్దెలమామా దరువే దరువు
నా పుత్తడిబొమ్మా
చరణం 1 :
జోరైన జోకరిది
జోడిస్తే గెలుపే
వయసొచ్చి వాలుతున్నా
వళ్ళంతా వలపే
తలపండి తాతనైనా
చేతల్లో మోతే
కవ్విస్తే కన్నెపిల్ల
కౌగిలి గిలిగింతే
ప్రేమెంతో ఉన్నవాణ్ణి చకచక్కా చకకచక్కా
పెళ్ళైనా కానివాణ్ణి చకచక్కా చకకచక్కా
మన్మధపాఠాలు ఇంకా తగ్గని వాణ్ని
మసకల్లో మల్లెపూలు మెక్కని వాణ్ణి
అటు పొద్దు ఇటు వాలే
అరె అర్ధో పావో ఇద్దూ ముద్దు
పెసరట్లోకి ఉప్మా ఉప్మా జతపెట్టేయ్ ముద్దు
నా ముద్దులకుడుము ఇస్తా వస్తే
నా ముద్దులగుమ్మా
చరణం 2 :
కాకీ బంగారు మామా
నకిలీ నీ ప్రేమా
నక్కవేషాల మామా
ఆపేయి డ్రామా
నీ రొయ్య మీసమేలా
ఓరయ్య సామీ
కొడతాడు గోలుకొండ
ఈ హేమాహేమీ
నీ దేహశుద్ధి ఖాయం చకచక్కా చకకచక్కా
తగులుద్ది ప్రేమగాయం చకచక్కా చకకచక్కా
బంగారు పళ్ళు ముందు కాస్త జాగరత
శృంగారం పట్టుపడితే చెల్లు నీ చరిత
ప్రియభామా పోదామా
మనకేలా బాలా ముసలి మసాలా
ముద్దులకుడుము ఇస్తా వస్తే...
No comments:
Post a Comment
Leave your comments