కవిత చిలికింది

చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: చిత్ర

పల్లవి :

కవిత చిలికింది కలికి వెన్నెలరాగం
నటన పలికింది ఋతువు విరిసిన లాస్యం

భూమి ఇరుసై తిరుగు వరకు
నాట్యమాడే కలలయోగం

సాగు మేఘం ఆగిపోయి వేసే తాళం

కవిత చిలికింది కలికి వెన్నెలరాగం
నటన పలికింది ఋతువు విరిసిన లాస్యం

చరణం 1 :

నిన్న నా పాట శృతిని విడనాడే
బాట చెరిపేటి విధికి నిధి ఓడే...

కాలయోగం కలసిరాక 
ప్రణయరేఖ కరిగిపోగా
చావబోతే చావు రాకా
ప్రాణమున్నా బ్రతకలేక

మౌనభారం మోయలేక
కనులు ఉన్నా వెలుగు రాక
తనువులో వలపులే వేదనై
జవనమే పున్నమో నెలపొడుపున

కవిత చిలికింది కలికి వెన్నెలరాగం
కవిత చిలికిందీ......
నటన పలికిందీ....... 
హో.....

చరణం 2:

ఓం తధీంతధీం పదాలు పాడా 
జగాలు కృంగ నా పదాలు ఆడా 
జగణ జగణ ధం ధంతక 
అరుణ చరణ ధం ధం ధం
జగణ జగణ ధం ధంతక 
అరుణ చరణ ధం ధం ధం

చలిత ధీంత ధీంత ధీంత
జ్వలిత ధీంత ధాంత స్వాంత  
ఓం తధీంతధీం పదాలు పాడా 
జగాలు కృంగ నా పదాలు ఆడా 

కొండమీద పడుచు మల్లి 
మధువు పూతలేల 

ఏటి నీటి పుటలలోన 
ప్రేమలేఖ లేల 

అలల నీటి కలల చేప 
వలకు చిక్కనేల 
కన్నె కాలిగజ్జె కొత్త 
పాట పాడనేల 

ఎదలోయలు తెలవార
సుఖపికములు ఎగసే 

జటతమసులు విడిపోగ 
రవికిరణము మెరిసే 
సుప్రభాత నటనమాడనా 
స్వప్నవీణ ఎదను మీటనా 
సుప్రభాత నటనమాడనా ఓం 

ఓం తధీంతధీం పదాలు పాడా 
జగాలు కృంగ నా పదాలు ఆడా 
ఓం తధీంతధీం పదాలు పాడా 
జగాలు కృంగ నా పదాలు ఆడా

No comments:

Post a Comment

Leave your comments