కరుణాలోలా నారాయణా
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: గబ్బిట వెంకటరావు
గానం:: బాలమురళీకృష్ణ
పల్లవి::
నారాయణ
కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా
కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా
కరుణాలోలా నారాయణా
చరణం 1:
నవరసభరితం నీ పుణ్యచరితం
ఈ జగమే నీ లీలావినోదం
నవరసభరితం నీ పుణ్యచరితం
ఈ జగమే నీ లీలావినోదం
కయ్యాలు లేక అల్లాడు నాకై
కయ్యాలు లేక అల్లాడు నాకై
కలహకారణం కల్పించినావా
కరుణాలోలా నారాయణా
చరణం 2:
ఎంతటి బ్రహ్మర్షి బిరుదంబులున్నా
శాంతము లేకున్న ఫలితము సున్నా
ఎంతటి బ్రహ్మర్షి బిరుదంబులున్నా
శాంతము లేకున్న ఫలితము సున్నా
తాపసి కీ వేళ తామసమది ఏలా
తాపసి కీ వేళ తామసమది ఏల
ఇది ఎల్ల నీ లీల కాదా దేవా?
చరణం 3:
నీ పదభక్తికి నీ ఘనశక్తికి
నీవే వైరము కలిగించినావే
నీ పదభక్తికి నీ ఘనశక్తికి
నీవే వైరము కలిగించినావే
ఏ పరమార్థము మదినెంచి నావో
ఏ పరమార్థము మదినెంచి నావో
తెలియగ వశమా నీ దివ్యమహిమా