Showing posts with label శ్రీ రామాంజనేయ యుద్ధం (1975). Show all posts
Showing posts with label శ్రీ రామాంజనేయ యుద్ధం (1975). Show all posts

భీషణమౌ శ్రీరామ శపథం..

భీషణమౌ శ్రీరామ శపథం..
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: ఆరుద్ర
గానం:: సుశీల, వసంత

పల్లవి: 

భీషణమౌ శ్రీరామ శపథం..
వీడదు ధర్మపథం

ఇప్పటి ఈ రఘురామ శపథం..
హృదయ విదారకం

రా రా ఓ రాజా

రా రా ఓ రాజా 
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: సినారె 
గానం:: జానకి 

పల్లవి::

రా రా ఓ రాజా 
రా రా ఓ రాజా 
చలచల్లనీ దినరాజా 
నులివెచ్చనీ నెలరాజా 
సుందర ప్రణయమందిరా 
సుగుణ బంధురా 
మునుముందర కౌగిలి విందురా 
ఇందిరా పొందరా 
రా రా ఓ రాజా

కరుణాలోలా నారాయణా

కరుణాలోలా నారాయణా 
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: గబ్బిట వెంకటరావు
గానం:: బాలమురళీకృష్ణ

పల్లవి::

నారాయణ
కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా

కరుణాలోలా నారాయణా
శ్రితజనపాలా...దీనావనా

కరుణాలోలా నారాయణా

శ్రీయుతమౌ శ్రీరామ పాదం

శ్రీయుతమౌ శ్రీరామ పాదం
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: ఆరుద్ర
గానం:: సుశీల, వసంత

పల్లవి::

శ్రీయుతమౌ శ్రీరామ పాదం..
శ్రితజన మందారం

పావనమీ రఘురామపాదం..
పాప వినాశకరం

సాకేత సార్వభౌమ

సాకేత సార్వభౌమ
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం:: మహదేవన్
రచన:: గబ్బిట వెంకటరావు
గానం:: ఈలపాట రఘురామయ్య

పల్లవి: 

రామా..
తగునా..
నీ దాసుపైన రణభేరివేయ..
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

శరణు శరణయా జానకి రామ
కరుణజూపవా మారుతిపై
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

జయతు జయతు..

జయతు జయతు..
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన:: కొసరాజు
గానం:: మాధవపెద్ది,వసంత

సాకి::

జయతు జయతు..శ్రీరామా రామ
జానకిరామా..జగదభిరామా
పావననామా..భండన భీమా
పట్టాభిరామా

పల్లవి :

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది 
సంపదలను తెచ్చింది..సౌఖ్యాలను యిచ్చింది 
భూలోకానికి స్వర్గం..దిగివచ్చింది

వచ్చింది వచ్చింది..రామరాజ్యం 
శ్రీరామయ్య పాలించు..చల్లని రాజ్యం

మేలుకో శ్రీరామ

మేలుకో శ్రీరామ
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
సంగీతం::మహదేవన్
రచన::దాశరథి
గానం:: బాలమురళీకృష్ణ, లీల 

పల్లవి::

మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ

మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ

మేలుకొని వేగ..మమ్మేలుకోవయ్యా

మేలుకొని వేగ..మమ్మేలుకోవయ్య

మేలుకో..మేలుకో...

మేలుకో..ఓఓఓఓఓ

శ్రీకరమౌ శ్రీరామ నామం



శ్రీకరమౌ శ్రీరామ నామం
చిత్రం : శ్రీ రామాంజనేయ యుద్ధం (1975)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల, బి.వసంత

పల్లవి :

శ్రీకరమౌ శ్రీరామ నామం
జీవామృతసారం
పావనమీ రఘురామ నామం
భవ తారకమంత్రం॥
దధిక్షీరమ్ములకన్నా ఎంతో
మధుర మధుర నామం
సదా శివుడు ఆ రజతాచలమున
సదా జపించే నామం
కరకుబోయ తిరగేసి పలికినా
కవిగా మలచిన నామం
రా... మరా... మరామ... రామ...
రామ రామ రామ రామ...॥
రాళ్లు నీళ్లపై చీల్చిన నామం
రక్కసి గుండెల శూలం॥

చరణం :

వేయి జపాల కోటి తపస్సుల
విలువ ఒక్కనామం
నిండుగ దండిగ వరములొసంగే
రెండక్షరముల నామం
ఎక్కడ రాముని భజన జరుగునో
అక్కడ హనుమకు స్థానం
చల్లని నామం మ్రోగే చోట
చెల్లదు మాయాజాలం
రామ రామ రామ సీతా
రామ రామ రామ రామ (2)॥

చరణం :

శ్రీయుతమౌ శ్రీరామ పాదం
శ్రీతజన మందారం
పావనమీ రఘురామ పాదం
పాపవినాశకరం
కలుషమ్ముల ప్రక్షాళన చేసే
గంగ చలించిన పాదం
అసురమదమ్మును పాతాళానికి
అణచివేసిన పాదం
రాతిని నాతిని చేసిన పాదం
అడవికి అందం పోసిన పాదం
నీ చరణమ్మే శరణమ్మనగా
ఇచ్చును పెన్నిధానం॥

చరణం :

అవలీలగ జలధిని దాటిన మేటి
పవనకుమారుడు పట్టే పాదం
బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం
పరబ్రహ్మ పదానికి మూలం
తాను ధరించిన పాదుకలకు
దర పట్టము కట్టిన పాదం
తమ్ముడు భరతుని తరతరాలకు
ధన్యుని చేసిన పాదం॥

రామ నీలమేఘశ్యామ


రామ నీలమేఘశ్యామ
చిత్రం: రామాంజనేయ యుద్ధం (1975)
రచన: గబ్బిట వెంకట రావు
గానం: ఈలపాట రఘురామయ్య
సంగీతం: కె.వి.మహదేవన్

జయతు జయతు మంత్రం
జన్మ సాఫల్యమంత్రం
రామ్ రామ్ రామ్

జనన మరణ దీధక్లేశ
విఛ్ఛేద మంత్రం 
రామ్ రామ్ రామ్

సకల నిగమ మంత్రం
సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం
రామ రామేతి మంత్రం

రామ నీలమేఘశ్యామ
కోదండ రామ
రఘుకులాబ్ది సోమ
పరందామా సార్వభౌమా

రామ నీలమేఘశ్యామ
కోదండ రామ
రఘుకులాబ్ది సోమ
పరందామా సార్వభౌమా
నీల మేఘ శ్యామ
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్

తల్లి తండ్రి గురువు నీవే
తోడు నీడ నీవే
తల్లి తండ్రి గురువు నీవే
తోడు నీడ నీవే

ధరణిజెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య
దాసులను బ్రోవగ రావయ్యా
జాగు ఇక చాలును రామయ్య
దాసులను బ్రోవగ రావయ్యా
తెలియ తరమా? పలుక వశమా?
నీదు మహిమా రాఘవ

రామ నీలమేఘశ్యామ
కోదండ రామ,
రఘుకులాబ్ది సోమ
పరందామా సార్వభౌమా
నీల మేఘ శ్యామ

రాతి నైన నాతిని జేసే నీ దివ్యపాదము
రాతి నైన నాతిని జేసే నీ దివ్యపాదము
కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్య,
నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు సరి దైవము లేరయ్య,
నిన్ను నే నమ్మితి రామయ్య
నీదు చరణం పాపహరణం
మాకు శరణం రాఘవ
రామ నీలమేఘశ్యామ
కోదండ రామ
రఘుకులాబ్ది సోమ
పరందామా సార్వభౌమా

నీలమేఘశ్యామ
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్
జయరామ్ రామ్ రామ్ జయరామ్