అమృతం కురిసిన రాత్రి

చిత్రం: ఏవండీ పెళ్లి చేసుకోండి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర

పల్లవి:

అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో 
తడిసిపోనీ ప్రియా

సందెలో చలి సావిత్రి
సందెకే రసగాయత్రి
మురళిలా పెదవితో 
కలిసిపోనీ ప్రియా

అష్టపది అందాలందుకో ఓ..
ఇష్టపడి ఈలే వేసుకో ఓ...

కోరస్:

గుచ్చకు గుచ్చకు గుమ్ముగా 
కసి తుమ్మెద అధరాలుగాయి 
అందమంత మరిగిన లేతసోకు 
పూతరేకు రసనల ఆకతాయి 
తాకిడీల తపనలతో

అమృతం కురిసిన రాత్రి
అతనితో కలిసిన రాత్రి

వలపులా వరదలో 
తడిసిపోనీ ప్రియా

చరణం: 1

కసి కసి వయసుల పసి మనసుల 
వలపిసిరిన వరసలలో

పెదవులు కలిపిన వలపుల 
పిలువని పిలుపుల చలి చిలకల కలలో 

రెప్పచాటు చూపులెన్నడో 

తాను చెప్పలేని బాషలాయలే

కంటిలోని రూపమెన్నడో

కన్నె గుండెలోన దీపమాయెలే

నిన్న మాయలే

నేడు హాయిలే

కొసరి కొసరి జత కోటి కోరికలు 
మీటి పాడు వేళా

అమృతం కురిసిన రాత్రి

చరణం: 2

ముగిసిన గతముల ముసిముసి నగవుల 
విరిసిన మమతలలో

తనువుల బిగువులు కరిగిన తపనలు 
రగిలిన చెలి అలకలకళలో

నేలమీద వానవిల్లులే 
నేను వేసుకున్న రంగవల్లులే

నవ్వులన్ని పూలజల్లులే
పాలుపొంగుతున్న పంటచేలులే

నేను నీవులే  

మనకు లేవులే

తెలిసి తెలిసి పెనుగింటి ప్రేమలకు 
వంతపాడువేళ

అమృతం కురిసిన రాత్రి

No comments:

Post a Comment

Leave your comments