చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: బాలు
పల్లవి:
రేగుతున్నదొక రాగం
ఎదలో సొదలా
రేపుతున్నదొక మోహం
నదిలో అలలా
కనులే ముద్దులాడగా...
కలలే కన్నుగీటగా...
కసిగా
రేగుతున్నదొక రాగం
ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం
నదిలో అలలా
చరణం 1:
చెక్కిళ్ళలో ముద్దుచెమ్మ
తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటిబొమ్మ
కదలాడిందే
తెలిపింది కన్నెగళమే
మనువాడలేదని
ఓ పువ్వు పూసింది ఒడిలో
తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై
మెలితిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా
హత్తుకొనే ప్రేమ
నీ పిలుపే పిలిచే వలపై
పెదవుల్లో దాగి
రేగుతున్నదొక రాగం
చరణం 2:
తారాడు తలపులెన్నో
నీలాల కురులలో
తనువు మరచిపోయే
మరులే పొంగే
ముద్దాడసాగె పెదవి
ఒక మూగభావమే
చాటు కవితలన్నీ
అనురాగాలే
పెదవులే విచ్చిన
మల్లెపూల వాసన
సొగసులే సోకిన
వయసుకే దీవెన
వీరెవరో జతకోకిలలో
ఎదలేడై లేచి
రేగుతున్నదొక రాగం
No comments:
Post a Comment
Leave your comments