రానేల వసంతాలే

చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: చిత్ర

పల్లవి :

రానేల వసంతాలే..
శృతి కానేల సరాగాలే
నీవే నా జీవనరాగం.. 
స్వరాలబంధం
నీదేనా యవ్వనకావ్యం.. 
స్మరించే గీతం

రానేల వసంతాలే..

చరణం 1 :

ఈ మౌన పంజరాన..
నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై

ఎగిరే శోకమై 
విరిసే తోటనై
ఏ పాట పాడినా
పది పూవులై
అవి నేల రాలినా 
చిరుతావినై
బదులైనలేని 
ఆశలారబోసి

రానేల వసంతాలే..

చరణం 2 :

ఓ ప్రేమికా చెలియా.. 
ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే 
దరిజేర్చవా

రగిలే తాపమే 
ఎదలో తీరగా
నీ చూపుతోనే 
చలి తీరగా
నీ స్పర్శతోనే 
మది పాడగా
ఎదమీటిపోయే 
ప్రేమగీతి లాగా

రానేల వసంతాలే.. 

No comments:

Post a Comment

Leave your comments