ఎంత సొగసుగాడే
చితం: సంగీత సామ్రాట్ (1984)
రచన: మహాకవి క్షేత్రయ్య
సంగీతం: రమేష్ నాయుడు
గానం: సుశీల, కృష్ణమూర్తి రాజు
ఎంత సొగసుగాడే గోపాలుడు
ఎంత సొగసుగాడే గోపాలుడు
ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే...ఇంతిరో
ఎంత సొగసుగాడే... ఇంతిరో
ఎడదను చింతన రేపిన
చిన్ని మాధవుడే
చరణం 1:
శిరమున నెమలి పింఛము జొనిపినవాడు
కురులను కలికి తురాయి కట్టినవాడు
కరముల సొంపగు మురళి పట్టినవాడు
చిరుమువ్వలను గట్టి చిందులేసెడివాడు
||ఎంత సొగసుగాడే||
చరణం 2:
కడవ నిడుకొని
వడివడి జనుచుండ
అడుగుల సడులాయెనే
తడబడి అడుగిడ
తరువుల మాటున
గడసరి మాధవుఁడు కనులానెలే
ఆగెనే....
చవితీరగ ఊగెనే
వడివడి ఇటు సాగెనే
పడతి మనసు లాగెనే
తమకము విడి పరువులిడుతు
రేపురము చేరినా చెలియ
కలలోన మరులు నింపెనే
||ఎంత సొగసుగాడే||