August 6, 2020

సిగ్గు సిగ్గంటవ్


సిగ్గు సిగ్గంటవ్
చిత్రం : నవభారతం (1988)
సంగీతం : చక్రవర్తి
రచన: వంగపండు ప్రసాదరావు,
గానం: వందేమాతరం శ్రీనివాస్ 

పల్లవి: 

సిగ్గూ సిగ్గంటవ్ సిగ్గేందిరో...?
సిగ్గుపడే పని చెయ్యలేదురో
సిగ్గు సిగ్గంటవ్ సిగ్గేందిరో...?
సిగ్గుపడే పని చెయ్యలేదురో
అను పల్లవి: 

కూలి నాలి కడుపుకొట్టి.... కోట్లుగుంజుకోలేదు
నల్లడబ్బు పంచిపెట్టి..... నాయకుడ్ని కాలేదు
అడ్డమైన పనులుచేసి..... అధికారిని కాలేదు
దరిద్రాన్ని తలుచుకుంటే... చరిత్రకే సిగ్గుచేటు
పేరు గొప్ప ఊరుదిబ్బ.... కొట్టమాకు నీ డబ్బా.. 
సిగ్గు సిగ్గంటవ్..

చరణం 1:

చదువుకోండి చదువుకోండి చవకబారు ఎదవలారా
చదువుకుంటే మీకెన్నో సదుపాయాలన్నారని
పుస్తెలతాడమ్ముకొని పుస్తకాలె కొన్నారా
పేగులెండగట్టుకొని ఫీజులెన్నోకట్టారా
కన్నకొడుకు చదువుకని కష్టపడిన తల్లితండ్రి
ఇల్లు ఒళ్ళు గుల్లాయెరా... సిగ్గు సిగ్గు
ముళ్ళకంప బతుకాయెరా... సిగ్గు సిగ్గు
బడాచదువు చదివినా... బండిని లాగిస్తున్నా...
నాయకులకు లేని సిగ్గు నడుమ నాకెందుకురో..
సిగ్గు సిగ్గంటవ్..

చరణం 2:

హేయ్ ఉద్యోగం వస్తుందని బ్రతుకుతెరువు ఇస్తుందని
ఎంప్లాయ్ మెంటూలోన పేరు నమోదు చేస్తే
ఇంటర్వ్యూ కార్డు కని కాకిలాగ కాసి కాసి
కాళ్ళ చెప్పులరిగిపోయే... కడుపంతామండిపోయే
నల్ల ఈక పండిపోయే....తెల్ల ఈక పుట్టుకొచ్చే
కంప్యూటర్ కుంపటొచ్చెనా... సిగ్గు సిగ్గు
కోట్ల జనం కడుపుకొట్టెనా... సిగ్గు సిగ్గు
మరమనిషిని తెచ్చిపెట్టెనా...సిగ్గు సిగ్గు
మనిషినోట మట్టిగొట్టెనా...సిగ్గు సిగ్గు
కొండనాలుకయ్యిందని... మహామహులు మందేస్తే 
ఉండనాలుకూడిపోయె.... ముండమోపి బతుకాయె
సిగ్గు సిగ్గంటవ్..

చరణం 3:

మంత్రిగారి మనవడని ఉంచినారు ఒక సీటు
ఆఫీసర్ చుట్టమని ఆపినారు ఒక సీటు
అమ్మగారి ఇలాకని, అయ్యగారి గులామని
సలాముకొట్టోడి కెల్ల సరాసరి ఉద్యోగం
దళారోడు, జులాయోడు దర్జాగా బ్రతుకుతుంటే
డిగ్రీ డింకీలు కొట్టెనా... సిగ్గు సిగ్గు
డొక్కేమో డోలు కొట్టెనా...సిగ్గు సిగ్గు
ఉన్న సీట్లు అన్ని కలిపి ఉన్నోడికె పంచిపెడ్తే
పెద్దోళ్ళకు లేని సిగ్గు... కొజ్జోళ్ళకు మాకెందుకు..
సిగ్గు సిగ్గంటవ్..

చరణం 4:

అరె... ఈ దారుణ నేరాలు ఇకనైనా ఆపకుంటె 
ఇదే తీరు పదే పదే యువశక్తిని కష్టపెడితే
ఆ శక్తే కాళికయ్యి నాలుక ఎగజాపుతుంది
అగ్నివృష్టి కురిపించి అవినీతిని కాల్చుతుంది
అక్రమాన్ని కడతేర్చి, సక్రమాన్ని నేర్పుతుంది 
ఆ..ఆనాడే అభ్యుదయంరా... నిజం నిజం
అందాక నిద్రపోకురా... అదే నిజం
నవశక్తిగ సంఘటించరా... క్షణ క్షణం
నవభారత సృష్టి చేయరా.. ప్రతిక్షణం
విద్యే విజ్ఞానమనె విపరీతార్ధాలు మాని
సమృద్ధిగ బ్రతికించే స్వయంశక్తివై రారా...
యువసమాజం మేలుకుందిరో
నవసమాజం కోరుతుందిరో..
యువసమాజం మేలుకుందిరో
నవసమాజం కోరుతుందిరో..