August 12, 2020

బందారు చిన్నదాన


బందారు చిన్నదాన
జానపదగీతం
వింజమూరి అనసూయాదేవి 
(అవసరాల అనసూయాదేవి) 

బందారు చిన్నదాన
బాజాబందూల దాన
బందారు చిన్నదాన
బాజాబందూల దాన
బాజా బందూల మీద
మోజేల లేదే
॥ఓ చిన్నదాన॥
గుంటూరు చిన్నదాన
గుళ్ళాపేరులదాన
గుళ్ళాపేరుల మీద
కళ్ళూ పోలేదే    
॥ఓ చిన్నదాన॥

కాకినాడ చిన్నదాన
కాసూల్‌ కంటేలదాన
కాసూల్ ‌కంటేల మీద
మనసేల లేదే
॥ఓ చిన్నదాన॥

అర్ధారూపాయి బెట్టి
అద్దాల రయిక కొంటె
అద్దాల రయిక మీద
బుద్ధేల లేదే
॥ఓ చిన్నదాన॥

నల్లనల్లాని దాన
నడుమూ సన్నాని దాన
తళుకూసేపల మల్లె
కులుకూ సూపుల దాన
॥ఓ చిన్నదాన॥