జజ్జనకరి జనారే
విప్లవశంఖం (1986)
సంగీతం: చక్రవర్తి
రచన: వంగపండు ప్రసాదరావు,
గానం: బాలు, ఎస్.పి. శైలజ
జజ్జనకరి జనారే...
ఝణకు ఝణా ఝణారే...
జజ్జనకరి జనారే
ఓయ్ జజ్జనకరి జజ్జనకరి
జజ్జనకరి జనారే...
అరెరెరె...రారోర రరారా
రర్రరర రరారా
రారోర రరారా
రర్రరర రరారా
జజ్జనకరి ఝణారే...
ఝణకు ఝణా ఝణారే...
జజ్జనకరి జనారే
ఝణకు ఝణా ఝణారే...
చరణం 1:
పూట పూట పస్తులతో
పుస్తకాలు సదివినోడ
ఫీజుగట్టడానికేమో
పీకులాట పడ్డవాడ
కాలుబట్టి, ఏలుబట్టి
కాలేజిలో సదివినోడ
గోల్డుమెడలు కొట్టినోడ
గోడకు దిగ్గొట్టితివా
||జజ్జనకరి ఝణారే||
చరణం 2:
చుక్కతెగీ రాలినట్టు
కొలువుకు పిలుపొచ్చినోడ
జాతి మతం లేదనంటు
రాతరాసిన రాజ్యాంగం
కులం మతం పేరుమీద
మనిషి మనిషినెంచుతుంది
ధనంబలం లేనివాడ
జనం బలం చూపించు
||జజ్జనకరి ఝణారే||
చరణం 3:
గుండెబలం పిండి పిండి
కండ కండ ఉండజేసి
ఎండలోన వానలోన
మూడుండల బండి తొక్కి
కిలింగ్ కిలింగ్ బెల్లుగొట్టి
కీలు కీలు వంచినోడ
శేటు బాబు రిక్ష అద్దె
సెమట పిండి ఇచ్చినోడ
||జజ్జనకరి ఝణారే||
చరణం 4:
ఎండిన గొంతుక తీసి
ఇంజను సైరను జేసి
ఆరిన పేగులు తీసి
ఆయిలు గొట్టాల్ జేసి
నరం నరం తీగ జేసి
కరెంటెలుగు తెచ్చినోడ
దివ్వెలోకి చమురు లేక
దిగులు మొహం పెట్టితివా?
||జజ్జనకరి ఝణారే||
చరణం 5:
యంత్రాలు దిప్పినోడ
ఉత్పత్తులు పెంచినోడ
బాధలొస్తె, బందెలొస్తే
బెంగపడి ఎండినోడ
చాలీచాలని జీతమంటె
సమ్మె హక్కు ఉన్నదంటె
ఎముకలిరగ తంతమని
యాక్టొక్కటి పెట్టినారు
||జజ్జనకరి ఝణారే||
చరణం 6:
నువ్ మేడి పట్టి దున్నకుండ
మేడ కట్టలేదు ఎవడూ...
బురదమట్టి కుమ్మకుండ
బువ్వ బుక్కలేదు ఎవడూ...
చుక్క చుక్క చెమట చేర్చి
మొక్క మొక్క నువ్ పెంచితే
ఆ పంటలన్ని పట్టుకెళ్ళి
బటాచోర్లు బలుస్తుండరు
||జజ్జనకరి ఝణారే||
చరణం 7:
పేదసాద కూలోణ్ణి
పేడ కంపు కొగ్గేసి
సన్నకారు రైతన్నకి
సదుపాయాలన్నారు
బండి లోను, బఱ్ఱె లోను
రండి రండి ఇస్తమండ్రు
ఆ సంతకాలు గెల్కటాన్కి
సగం డబ్బు గుంజుతుండ్రు
||జజ్జనకరి ఝణారే||
చరణం 8:
కాయితాల కట్టల్లో
కందిరీగ లాగ తిరిగి
మధ్య రకం జీతగాడ
మర్యాదగ బతికినోడ
ఆలుబిడ్డలు కట్టగట్టి
రేషన్ కార్డట్టుకుని
కిర్సనూని లైను కాడ
కర్సుకోని సత్తున్నవా
||జజ్జనకరి ఝణారే||
చరణం 9:
ఆలుబిడ్డలు జబ్బుపడితె
తాళి పద్దు పెట్టినోడ
కంటి ముందు కష్టాలు
ఇంటిముందు అప్పులోళ్ళు
రోజు రోజు బతుకు చూసి
రోగిలాగ మారినోడ
బెంచి మీద చెయ్యెట్టి
బతుకుసెడ్డ కుటుంబయ్య
||జజ్జనకరి ఝణారే||
చరణం 10:
ప్రగతి ప్రజాస్వామ్యమని
ఏసిరెన్నో పథకాలు
ఆఫీసుల, ఫ్యాక్టరీల
ఆస్తిపరుల పెంచారు
పేదవాళ్ళ కడుపులోన
పెరుగుతున్న ధరలు పెట్టి
రైతుకూలి చేతికేమో
పన్నులు పగ్గాలుగట్టి
||జజ్జనకరి ఝణారే||
చరణం 11:
కూలోడా నాలోడా
ఉద్యోగం లేనోడా
నాగలెత్తి దున్నినోడ
నట్టు మరలు తిప్పినోడ
ఊపిరంత ఉరుముజేసి
ఆకలంత పిడుగుజేసి
కొత్తదనం ఎరుపుజేసి
ఎత్తండిర మన జెండా
||జజ్జనకరి ఝణారే||