August 12, 2020
నీ అత్తారింటికెల్లి
నీ అత్తారింటికెల్లి
జానపదగీతం
రచన, గానం: మనాప్రగడ నరసింహమూర్తి
నీ అత్తారింటికెల్లి
ఉత్తరమొచ్చిందిరో
నా బాబూ... ఓ బాబూ
నా బాబూ... నీ అత్తారింటికెల్లి
ఉత్తరమొచ్చిందిరో
నా బాబూ... ఓ బాబూ
నా బాబూ...
నా అత్తారింటికెల్లి
ఉత్తరమొస్తే
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మో
నాయమ్మో
నా అత్తారింటికెల్లి
ఉత్తరమొస్తే
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో.... మాయమ్మో
నాయమ్మో
నువ్ నాంపల్లి కాడా
బస్సెక్కరా కొడకో
ఓ బాబూ... నా బాబూ
ఓ బాబూ...
నేన్ నాంపల్లి కాడా
బస్సెక్కినాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా...
నువ్ ఉప్పల్ కాడా
దిగిపోరా కొడకో
ఓ బాబూ... నా బాబూ
ఓ బాబూ...
చౌటుప్పల్ కాడా
దిగిపోయి నాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా...
ఆడికి నీ మీసాల బామ్మర్దొస్తాడు
నిన్నింటికి తీసుకెళ్తాడు
ఎదురుగా మీ
అత్తగారొస్తుందిరా బాబూ..
అమ్మ బాబోయ్...!
నీకు చెంబుతో నీళ్లిస్తది
నువ్వు కాళ్ళు కడుక్కోవాలి
ఆ... కాళ్ళు కడుక్కున్నాక
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా
నే కాళ్ళు కడుక్కున్నాక
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా
అప్పుడు నీ అత్తగారు
నిన్ను ఎంతో ప్రేమతోటి
గదిలోకి తీస్కెళ్ళి
భోజనం పెడతాదిరా
ఎర్రిబాగులోడా....
నువ్ భోంచేయాలి
ఆ భోంచేసినాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో మాయమ్మా
నాయమ్మా
నే భోంచేసినాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో మాయమ్మా
నాయమ్మా
ఆ...
అప్పుడొత్తాదిరా బాబూ నీ పెళ్ళాం
నిన్ను గదిలోకి తీస్కెళ్తుంది
ఓరి ఎర్రిబాగులోడా...
నువ్ పడుకోవాల్రా బాబూ
ఆ పడుకున్నాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా...
నే పడుకున్నాకా
నన్నేం చేయమంటావే..?
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా...
ఆ సమయమందునా...
నిమిషమందునా
ఆ సమయమందునా...
నిమిషమందునా
అది గిల్లేస్తుందో
అది రక్కేస్తుందో
నను పట్టేస్తుందో
మీదెక్కేస్తుందో
భయమేస్తుందమ్మో...
ఓయమ్మో... మాయమ్మా
నాయమ్మా...
అది గిల్లేస్తుందో
రక్కేస్తుందో
నను పట్టేస్తుందో
మీదెక్కేస్తుందో
భయమేస్తుందమ్మో
ఓయమ్మో...మాయమ్మా
నాయమ్మా...
ఛీ... నాకొడకా!
నువ్ తూరుపుకెళ్ళి
దణ్ణం పెట్రా కొడకో
ఓ బాబూ నా బాబూ
ఓ బాబూ...
నువ్ తూరుపుకెళ్ళి
దణ్ణం పెట్రా కొడకో
ఓ బాబూ... నా బాబూ
ఓ బాబూ...
నువ్ తూరుపుకెళ్ళి
దణ్ణం పెట్రా కొడకో
ఓ బాబూ... నా బాబూ
ఓ బాబూ...