ఏం పిల్లడో...
జానపదగీతం
అర్ధరాత్రి స్వతంత్రం (1986)
సంగీతం: సత్యం
రచన, గానం: వంగపండు ప్రసాదరావు
ఏం పిల్లడో ఎల్దమొస్తవ
ఏం పిల్లో ఎల్దామొస్తవ
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
శ్రీకాకుళంలో సీమకొండకి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
అరె సిలకలు, బల్ సిలకలు
అహ సిలకలు కత్తులు దులపరిస్తయట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఒరే సాలూరవతల సవర్లకొండకి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
సెమర పిల్లులే శంఖమూదెనట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఒరే నల్లగొండా నట్టడివిలోనికి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఓ పాముని, బల్ పాముని
అహ పాముని బొడిచిన చీమాలున్నయట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఒరే తెలంగాణ కొమరయ్యకొండకీ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
అరెరరెరెరె...అహ్హుహ్హ
అరె గెద్దని, ఒహొ గెద్దని
తన్నిన గేతూలున్నయట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఒరే బాకులు మేసిన మేకల కొండకి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
పులుల్ని, అరె పులుల్ని
అరె పులుల్ని మింగిన గొఱ్ఱేలున్నయట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఆ రాయలసీమ రాలుకొండకి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
రత్తం, అరె రత్తం
రాజ్జెం ఏలుతుందటా
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఒరే తూరుపు
అరె తూరుపు దిక్కున దోరకొండకి
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
అరెరరెరెరె...అహ్హుహ్హ
అరె తుపాకీ, చల్ తుపాకీ
అరె తుపాకీ పేల్చిన తూరీగలున్నయట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఒరె కలకత్తా
కొస కాడ కొండకీ
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఒరె ఎలకలు, ఎలకలు
ఎలకలు పిల్లిని ఎంటా దగిలెనట
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ
ఏం పిల్లడో
ఎల్దమొస్తవ
ఏం పిల్లో
ఎల్దామొస్తవ