October 10, 2020

ఎంత చక్కని వాడే నా సామి


ఎంత చక్కని
రాగం: యదుకులకాంభోజి
తాళం: ఆది
రచన: క్షేత్రయ్య
గానం: సుశీల
 
పల్లవి:
 
ఎంత చక్కని వాడే నా సామి
వీడు ఎంత చక్కని వాడే
 
అనుపల్లవి:
 
ఇంతి మువ్వగోపాలుడు సంతతము
నా మదికి సంతోషమే చేసెనేచరణం 1
 
మొలక నవ్వుల వాడె
ముద్దు మాటల వాడే...ఏ...
తళుకు చెక్కుటద్దముల వాడె
తలిరాకు జిగి దెగడ దగు మోవి గలవాడె
తెలిదమ్మి రేకుల కన్నుల నమరువాడే
 
చరణం 2
 
పొదలు కెందామరల వెంపొదవు పదముల వాడే
కొదమసింగపు నడుము కొమరమరు వాడే
మద కరిజగముల మురువు చేతుల వాడే...ఏ...
సుదతి మువ్వగోపాలుడెంత సొగసు గలవాడే