August 1, 2020

నింగి చుట్టే


నింగి చుట్టే
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
రచన: విశ్వా      
గానం: విజయ్ ఏసుదాస్ 
సంగీతం: బిజీబల్  

పల్లవి : 

నింగి చుట్టే 
మేఘం ఎరుగద
ఈ లోకం గుట్టు 
మునిలా.. 
మెదలదు నీమీదొట్టు
కాలం కదలికలతొ.. జోడి కట్టు.. 
తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే 
మేఘం ఎరుగద
ఈ లోకం గుట్టు 
మునిలా.. 
మెదలదు నీమీదొట్టు

కాలం కదలికలతొ జోడి కట్టు.. 
తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

చరణం 1: 

తమదేదొ తమదంటు.. 
మితిమీర తగదంటు..
తమదైన తృణమైన చాలదు వరస…

ఉచితాన సలహాలు.. 
పగలేని కలహాలు..
ఎనలేని కథనాల చోటిది బహుశః…

ఆరాటం 
తెలియని జంఝాటం.. 
తమదిగ చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. 
కథ సగటుల చుట్టూ..

చరణం 2:

సిసలైన సరదాలు.. 
పడిలేచె పయనాలు..
తరిమేసి తిమిరాలు.. 
నడిచెలె మనసా…

విసుగేది దరిరాని.. 
విధిరాత కదిలేటి..
శతకోటి సహనాల.. 
నడవడి తెలుసా…

చిత్రంగా...
కలివిడి సూత్రంగా..
కనపడె ప్రేమ, పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సగటుల కనికట్టు…

నింగి చుట్టే 
మేఘం ఎరుగద
ఈ లోకం గుట్టు 
మునిలా.. 
మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు.. 
తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…