August 6, 2020

చచ్చినా దమ్మిడొగ్గను



చచ్చినా దమ్మిడొగ్గను...
అర్ధరాత్రి స్వతంత్రం (1986)
సంగీతం: సత్యం 
రచన, గానం: వంగపండు ప్రసాదరావు, రాళ్ళపల్లి 

హేయ్...
అమ్మ చచ్చినా దమ్మిడొగ్గను
నీ అయ్య చచ్చినా దమ్మిడొగ్గను
నీ అమ్మా చచ్చినా దమ్మిడొగ్గను
యయ్యా చచ్చినా దమ్మిడొగ్గను
నీ అమ్మ చచ్చినా దమ్మిడొగ్గనూ...

చరణం 1:

పదీ పాతికీ అప్పని జెప్పే 
మోసము చేస్తే తప్పని జెప్పే 
పావలాకి పరకొడ్డీ రాసే  
వడ్డీకొడ్డీ లెక్కలు ఏసే 
 
అరె వడ్డీకొడ్డీ లెక్కలు ఏసే
బడి పెద్దలతో పక్కగిల్లెనే 
ప్లీడరునెట్టి పీకుడు పెట్టే... 
||నీ అమ్మ చచ్చినా దమ్మిడొగ్గను|| 

రేయ్...రేయ్...పాపం పాటలు పాడకరా 
పెద్దపులొచ్చి ఎద్దులెట్టుకెళ్ళి పోయినట్టు.. 
దేవత తినీయ్ గల్దు.
ఏయ్...ఎల్లెసెహే... 

చరణం 2:

రేయ్...సీమ కాటా చేతిని బెట్టే
ఎత్తుకు మొత్తం కొలతలు బెట్టే 
పుట్టెడు టేకు పది కేజీలని 
పట్టుకపోయి 
గోదాము లెట్టే...

ఒరె పట్టుకపోయీ గోదాము లెట్టి 
పట్నములో పదిరెట్టుల కమ్మి 
ఇనపబీరువా ఇంటిలో బెట్టే  
||నీ అమ్మ చచ్చినా దమ్మిడొగ్గను|| 

మించిపోతున్నావ్ రో నాకొడకా 
దెబ్బతినేత్తావ్ సుమీ 
ఏయ్...లెగు లెగు లెగస్సే...

చరణం 3:

ఒరేయ్ నక్కమాదిరి ఏషము ఏసి 
తప్పుడు లెక్కలు రాతలు రాసి 
ఏడాదైనా ఎల్లకముందే 
ఏడు గదులతో మేడే కట్టే...
ఒరె ఏడు గదులతో మేడే కట్టే
మేడమీద ఒక సిలకను బెట్టే....
మా పెజల నోటిలో మట్టిని కొట్టే 
||నీ అమ్మ చచ్చినా దమ్మిడొగ్గను||
రేయ్...ఈ కుఱ్ఱ మాటలు తప్పితే.. 
దరువులు కాసేస్తావరేయ్... 
నాకొడకా నడువ్ 
ఏయ్...ఒగ్గు..ఒగ్గు 
కొండదేవరకి నిన్ను బలిచ్చేస్తా 
నాకొడకా నడువ్...
నడవమన్నానా...
నడవ్వా...