గంగానమ్మో...
జానపదగీతం
రచన, గానం: పి.వి.చలపతిరావు
గంగానమ్మో
పోలేరమ్మో
గంగరావి చెట్టు కింద
అంకాళమ్మో...ఓ...
అంకాళమ్మో...
||గంగానమ్మో||
కల్లుముంతలిస్తానే
వద్దూ...వద్దూ...
కోడిపెట్టలిస్తానే
వద్దు...వద్దు...వద్దు
అహ...కల్లుముంతలిస్తానే
కోడిపెట్టాలిస్తానే
సల్లంగా మా పల్లెను
కాపాడమ్మో....
||గంగానమ్మో||
కల్లుముంత లేమూలకి రోయ్
కోడిపెట్ట లేమూలకి రోయ్
గొర్రెపోతు నేస్తే
నిను పెద్దని చేస్తానోయ్...
దున్నపోతు నేస్తే
నిను దొరబాబుని చేస్తానోయ్...
తాడెత్తున ప్రభ కడతా
తందనాలు తొక్కిస్తా
తాడెత్తున ప్రభ కడతా
తందనాలు తొక్కిస్తా
తల్లీ నీ చల్లని చూపె
కావాలమ్మో...
||గంగానమ్మో||
ఊరి ఎనక మఱ్ఱి కాడ
ఉత్తరాన జువ్వి నీడ
ఊరి ఎనక మఱ్ఱి కాడ
ఉత్తరాన జువ్వి నీడ
నడిబొడ్డులో ఉన్నా
నాంచారమ్మ గుడికాడా
తల్లో...తల్లో...
అక్కడా...ఇక్కడా...
ఎక్కడ జూసినా
దెయ్యాలై... భూతాలై
తిరుగుతున్నయ్యంట
చెయ్యరాని దారుణాలు
చేస్తన్నయ్యంట
దెయ్యాలై... భూతాలై
తిరుగుతున్నయ్యంట
చెయ్యరాని దారుణాలు
చేస్తన్నయ్యంట
తల్లోయ్...
తల్లోయ్...యా...
||గంగానమ్మో||