ఎవ్వడే వాడు...
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
రాగం: శంకరాభరణం, చాపు
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి
పల్లవి :
ఎవ్వడే వాడు...
ఎవ్వడే వాడు...
ఎవ్వడే వాడు
నేను పవ్వళించిన వేళ
పువ్వు బాణాలు వేసి
రవ్వజేసి పోయే...
చరణం 1:
పట్టపగలు వాడు వచ్చి
పలు దిట్టధైన ఇల్లు జొచ్చి
పట్టె నన్ను చెట్ట పట్టి
గట్టిగా నా మోవి గంటు జేసి పోయె...
చరణం 2:
నీలమేఘ శ్యామలాంగుడు...
మంచి మేలు పీతాంబరధారుడు
వాడు లీలగా పదియారువేల గోప స్త్రీల
నేలిన మువ్వ గోపాలుడే నేమో||