దిగు దిగు దిగు నాగ
జానపద గీతం
రచన: మనాప్రగడ నరసింహమూర్తి,
గానం: పారుపల్లి రంగనాథ్
దిగు దిగు దిగు నాగ నాగన్న
ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసనతో నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||
|| దిగు దిగు దిగు నాగ ||
భామా లంత చేరి నాగన్న
బావీ నీళ్ళ కెళితే నాగన్న
బావిలొ వున్నావా నాగన్న
బాలా నాగువయ్యో నాగన్న ||
|| దిగు దిగు దిగు నాగ ||
పిల్లాలంత చేరి నాగన్న
పుల్లాలేర బోతె నాగన్న
పుల్లల్లో వున్నావా నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||
|| దిగు దిగు దిగు నాగ ||
స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ళ కెళితే నాగన్న
రేవులొ వున్నావా నాగన్న
కాలా నాగు వయ్యో నాగన్న ||
|| దిగు దిగు దిగు నాగ ||
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండలో వున్నావా నాగన్న
కోడె నాగు వయ్యో నాగన్న ||
|| దిగు దిగు దిగు నాగ ||