August 11, 2020

నిరా నిరా నిరబండి


నిరా నిరా నిరబండి
జానపదగీతం
(బండి తోలుతూ పాడే పాట...)
రచన : మనాప్రగడ నరసింహమూర్తి
గానం: మనాప్రగడ నరసింహమూర్తి, ఛాయాదేవి 

నిన్ను రమ్మన్నాది
నన్నూ రమ్మన్నాది
ఇద్దర్ని రమ్మనీ...
నిద్దరోతోందో....
నిరా నిరా నిరబండి
నిర నిర నిరబండి
నిరా నిరా నిరబండి
అమ్మతోడు
||నిన్ను రమ్మన్నాది||
బార కొమ్ముల గేదె
బాడవలో కొచ్చింది
నీ అన్న మాదొంగ
నాగూరే దొంగ...
||నిరా నిరా నిరబండి||
(బాడవ= నీళ్లు నిలుచు వల్లపు ప్రదేశము,
వాకపొలము లేక నీరువాక)

తాటాకు తలగుడ్డ
గోంగూర గోచీగుడ్డ
వీధిలో యిటికామ
యియ్యంకుడిల్లే...
||నిరా నిరా నిరబండి||

ఆపర బండోడో...
అంతరాల నా బండి
చీరా కట్టుకొస్తా
ఆపర బండోడో...
అంతరాల నా బండి
కొత్తా చీరా కట్టుకొస్తా
ఆపర బండోడో...
అంతరాల నా బండి
పైటా ఏసూకొస్తా
ఆపర బండోడో...
అంతరాల నా బండి
పూల రైకా ఏసూకొస్తా
ఆపర బండోడో...
అంతరాల నా బండి

ఎర్రాఎర్రని దాన
ఎర్ర జాకెట్టు దాన
నల్లా నల్లని దానా
నడుము సన్నని దానా
||ఎర్రాఎర్రని దాన||
నీయన్న మాదొంగ
నాగూరే దొంగా...
||నిరా నిరా నిరబండి||