August 9, 2020

చక్కని ఓ జాబిల్లీ...


చక్కని ఓ జాబిల్లీ...
పెళ్ళితాంబూలం (1962)
రచన: అనిసెట్టి
సంగీతం: విశ్వనాథన్ & రామ్మూర్తి
గానం: పి.బి.శ్రీనివాస్  

పల్లవి:

చక్కని ఓ జాబిల్లీ...
పలుకవేలనే...
నీ వలపులతో నా మనసే...
చిలుకవేలనే...
చక్కని ఓ జాబిల్లి
పలుకవేలనే...
హృదయాలను ఊగించే
సోయగమిదియే
కనులార నినుగాంచీ...
సోలును మదియే...
చక్కని ఓ జాబిల్లీ
పలుకవేలనే...

చరణం 1:

మైకములో మరిపించే
కలలరాణియే...
చెలియా...
మౌనముగా మాటాడే
గగనవాణియే...

మైకములో మరిపించే
కలలరాణియే...
చెలియా
మౌనముగా మాటాడే
గగనవాణియే...

జవరాలి చక్కదనం
ప్రేమ జ్యోతియే
ఇలలో
చల్లని నా చెలి నీడ
బ్రతుకు బాటయే...
||చక్కని ఓ జాబిల్లీ||

చరణం 2:

కలతలలో కంపించే
జీవనావ యే
నడిపే
చెలిచూపే దరిజూపే
దివ్యతారయే...

చెలిపలుకే లాలించే
గానమౌనులే...
మనకూ
కనువిందౌ కాపురమే
గమ్యమౌనులే
||చక్కని ఓ జాబిల్లీ||