చీరెలు తెమ్మన్నగాని
జానపదగీతం
రచన, గానం: మనాప్రగడ నరసింహమూర్తి
చీరెలు తెమ్మన్నగాని
ఓ దొరా...
చీరెలు తెమ్మన్నగాని
సిక్కుల పడమన్ననా.. చీరెలు తెమ్మన్నగాని
సిక్కుల పడమన్ననా...
నమ్మయ్ లో నాయి దొరా
నిన్నే నేమన్ననా
నమ్మయ్ లో నాయి దొరా
నిన్నే నేమన్ననా
కడియాల్ తెమ్మన్నగాని
ఓ దొరా...
కడియాల్ తెమ్మన్నగాని
ఖైదిలో పడమన్ననా
కడియాల్ తెమ్మన్నగాని
ఖైదిలో పడమన్ననా
||నమ్మయ్ లో నాయి దొరా||
గాజులు తెమ్మన్నగాని
ఓ దొరా...
గాజులు తెమ్మన్నగాని
గంగల పడమన్ననా..
గాజులు తెమ్మన్నగాని
గంగల పడమన్ననా..
||నమ్మయ్ లో నాయి దొరా||
మట్టెలు తెమ్మన్నగాని
ఓ దొరా...
మట్టెలు తెమ్మన్నగాని
మడుగుల పడమన్ననా..
మట్టెలు తెమ్మన్నగాని
మడుగుల పడమన్ననా..
||నమ్మయ్ లో నాయి దొరా||
ఒడ్డాణం తెమ్మన్నగాని
ఓ దొరా...
ఒడ్డాణం తెమ్మన్నగాని
ఒడ్డున పడమన్ననా..
ఒడ్డాణం తెమ్మన్నగాని
ఒడ్డున పడమన్ననా..
||నమ్మయ్ లో నాయి దొరా||
మంచం తెమ్మన్నగాని
అమ్మతోడు...
మంచం తెమ్మన్నగాని
మద్దెల పడమన్ననా..
మంచం తెమ్మన్నగాని
మద్దెల పడమన్ననా..
||నమ్మయ్ లో నాయి దొరా||
అన్నీ తెమ్మన్నగాని
ఓ దొరా..
అన్నీ తెమ్మన్నగాని
అడ్డం బడమన్ననా..
అన్నీ తెమ్మన్నగాని
అడ్డం బడమన్ననా..
||నమ్మయ్ లో నాయి దొరా||
||మంచం తెమ్మన్నగాని||
||అన్నీ తెమ్మన్నగాని||
ఓ దొరా..
సీసాల్ తెమ్మన్నగాని
ఓ దొరా..
సీసాల్ తెమ్మన్నగాని
సిగ్గుదీయమన్ననా
సీసాల్ తెమ్మన్నగాని
సిగ్గుదీయమన్ననా
||నమ్మయ్ లో నాయి దొరా||