August 11, 2020

మామా నాగులు...



నాగులు మామ అంటే అమితమైన అభిమానం ఉంది ఆ కన్నెపిల్లకి.
ఆ కన్నెపిల్ల అతన్ని వలచి, వలపించుకుని గడుసుగా
తన వెంట తిప్పుకుంది. ఆ పిల్లను చూసుకుంటూ...
ప్రతిరోజూకాలుజారి క్రింద పడటమే వాని పని.
ఆ వైనాన్ని చూసి ఆ కొంటె పిల్ల ఎగతాళి చేస్తూ ఉంది..
ఎలా...?

మామా నాగులు...
జానపదగీతం
రచన, సంగీతం: మనాప్రగడ నరసింహమూర్తి,
పాడినవారు: స్వర్ణలత

||మామా నాగులు...||

అడ్డగోడల మింద...
అడ్డగోడల మింద
అడ్డగోడల మింద...
అడ్డ...అడ్డ....అడ్డ
అడ్డగోడల మింద
అలిగి పన్యావురో
||మామా నాగులు..||  సరసరమనుకుంట
సరసాలాడుకుంటా
సరసరమనుకుంట
సరసాలాడుకుంటా
సారా సీసల కాడ
సారా సీసల కాడ
సారా సీసల కాడ
తాగి పన్యావురో...
||మామా నాగులు..||

మరచితి నొకమాట
మల్లారెడ్డి పేట
మరచితి నొకమాట
మల్లారెడ్డి పేట
మత్తోళ్ళింటి కాడ
కల్లుముంతల కాడ
కల్లుముంతల కాడ
కల్లుముంతల కాడ
కలికి పన్యావురో
||మామా నాగులు||