August 13, 2020

కోడి కూసె నయ్యయ్యో


కోడి కూసె నయ్యయ్యో
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి  

పల్లవి :
 
కోడి కూసె నయ్యయ్యో....
నా గుండె ఝల్లుఝల్లు మనేనమ్మా...

అను పల్లవి :

చెడెరో నా సామి వద్ద జేరి
నేనే మాటాడు నంతలో
//కోడి//
చరణము 1 :
 
చెలువుని కెదురేగి చెలగించి తోడితెచ్చి
కలపము మైనిండా అలది కస్తూరి నామము బెట్టి
కలువరేనితో కలహము ముగియించి
చలువ చప్పరములో సరసమాడేటంతలో...
//కోడి//

చరణము 2 :

మ్రొక్కీ....వేడికొని
ఎంతో మోహమునా ముద్దు పెట్టి
అక్కరో సిగ్గింత లేక
ఆ వేళ నీవి వదలెంచి...
మక్కువ మీరా మదనమందిరము చేర్చి...
చక్కని మువ్వగోపాల సామితో కలిసేటంతలో...

//కోడి//