August 12, 2020

సూడాలని ఉన్నది


సూడాలని ఉన్నది
జానపదగీతం
రచన, గానం: మనాప్రగడ నరసింహమూర్తి

సూడాలని ఉన్నది...
సూడాలని ఉన్నది
నీడవోలే నిన్నిడువక
సూడాలని ఉన్నది
నీడవోలే నిన్నిడువక
సూడాలని ఉన్నది
సిగనిండా పూలుచుట్టి
చేతిలోనా గంపబట్టి
ఒయ్యారం ఒలకబోస్తూ
ఒడ్డుమీదా వస్తావుంటే
||సూడాలని ఉన్నది||

చేను మధ్యన మంచెమీదా
చిలకరంగూ చీరతోని
వడిసెలేసీ నిలుసుంటే...
ఒలుపునున్నా నీ సూపు...
||సూడాలని ఉన్నది||
 
మంచినీళ్ళ బావి నుండి
కడవెత్తుక వస్తూవుంటే
అడుగులోన అడుగేసి
అందాన్ని కండ్లతోనా
||సూడాలని ఉన్నది||

వరిమడిలో నడుస్తుంటే
ఒడ్డుమీదా నిలుసుంటే
క్షణమైనా విడువకుండా
చిత్తరంగా నిన్నెపుడూ
||సూడాలని ఉన్నది||