July 27, 2020

ఏదోలా ఉందే


ఏదోలా ఉందే 
నేనింతే (2008)
రచన: రామజోగయ్య శాస్త్రి  
సంగీతం: చక్రి 
గానం: రఘు కుంచె 

పల్లవి:

ఓ నో నో నో నో నో నో…… 
ఓ నో నో నో నో నో నో...
ఏదోలా ఉందే నువ్వే లేక 
ఏమీ బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక 
ఉన్నానీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం 
నువ్ గిల్లావే నా ప్రాణం

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఏదోలా ఉందే నువ్వే లేక 
ఏమీ బాలేదే నువ్వెళ్ళాక

చరణం 1: 

మిల మిల మిల మిల మెరుపుల తార...
కలలకు కళ కళ చిలికిన తార..
తళ తళ తళ తళ తళుకుల తార...
గల గల నగవుల చిలిపి సితార...
ఏమంటే ఎందుకంటే కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంటా నువ్వంటా...
నా కంటిముందే ఉంటే చాలనుకున్నా
నువ్ దూరమైతే ఏదో అయిపోతున్నా
ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం 
నువ్ గిల్లావే నా ప్రాణం

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఏదోలా ఉందే నువ్వే లేక 
ఏమీ బాలేదే నువ్వెళ్ళాక

చరణం 2: 

నిగ నిగ సొగసులు కురిసిన తార...
చనువుగ మనసును తడిపిన తార...
తలపుల తలుపును కదిపిన తార...
ఎద సడి పలికిన వలపు సితార...
తేదీలే మారుతున్నా నిన్నలో నే ఉన్నానే
మనసంతా నింపుకున్నా నీతోనే...
నువ్ దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగి తార నువ్వుండాలే పైనా
ఓ నో నో నో నో నో నో… 
నువ్వే నా సంతోషం 
నువ్ గిల్లావే నా ప్రాణం

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఓ ఐ మిస్ యు 
ఓ ఐ మిస్ యు 
ఐ మిస్ యు ది డార్లింగ్ హియర్ 

ఏదోలా ఉందే నువ్వే లేక 
ఏమీ బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక...
ఉన్నానీ కల్లో నిదర్రాక...
ఓ నో నో నో నో నో నో… 
ఓ నో నో నో నో నో నో…