ఇది ఆదిమానవుడి ఆరాటం
చిత్రం: పోరాటం (1983)
సంగీతం: చక్రవర్తి
రచన: రాజశ్రీ
గానం: బాలు
పల్లవి:
ఇది ఆదిమానవుడి ఆరాటం
ఆ దైవంతోనే చెలగాటం
విధి ఆడే ఈ చదరంగంలో
జీవితమే ఓ పోరాటం
ఇది జీవనపోరాటం...
ఇది జీవనపోరాటం...
ఇవాళ (14.01.2022) జంధ్యాల గారి జయంతి సందర్భంగా:
సినిమాల్లో మనం చూసే హాస్యం దర్శకుని అభిరుచి
మేరకు రకరకాల పద్ధతుల్లో సృష్టించబడుతుంది. కొందరు దర్శకులు దృశ్య ప్రధానమైన హాస్యం
ఇష్టపడితే, ఎక్కువమంది దర్శకులు సంభాషణల పరంగా కానీ నేపథ్య
సంగీతం మూలంగా హాస్యం వచ్చేలా చూసుకుంటారు. డైలాగులు లేకుండా దృశ్య ప్రధానమైన
హాస్యం చూపించడం అంత తేలిక కాదు కాబట్టి తెలుగులో సంభాషణల పరంగా ఉండే హాస్యమే
ఎక్కువ. ఈ రకపు హాస్యాన్ని మాటల రచయిత నుంచి, నటుల
దగ్గర్నుంచి రాబట్టుకోవడం తేలిక కూడాను.
అసలింతకీ తెలుగు చలనచిత్రాల్లో హాస్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? (ఇక్కడ నేను గమనించిన దాదాపు ఏభై రకాల హాస్య ప్రక్రియలను ప్రస్తావించాను. వెదికితే ఇంకా ఉంటాయి.)