తల్లిదండ్రులు (1970)
సంగీతం: ఘంటసాల
గానం: జానకి బృందం
రచన: శ్రీ ప్రయాగ
పల్లవి:
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు
ఆదీలక్ష్మి అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు
చరణం 1:
కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు
మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు
ముద్దులగుమ్మ బంగరుబొమ్మ రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు
మా రుక్మీణమ్మకు గొబ్బిళ్ళు
చరణం 2:
చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్యతండ్రికి గొబ్బిళ్ళు
మా రామయ్యతండ్రికి గొబ్బిళ్ళు
కన్నాతల్లి కల్పావల్లి సీతమ్మతల్లికి గొబ్బిళ్ళు
మా సీతమ్మతల్లికి గొబ్బిళ్ళు
చరణం 3:
పాడీపంటల తులతూగే మా భారతమాతకు గొబ్బిళ్ళు
మా భారతమాతకు గొబ్బిళ్ళు
శాంతీ, సౌఖ్యం, ధర్మం నిలిపే స్వతంత్రలక్ష్మికి గొబ్బిళ్ళు
మా స్వతంత్రలక్ష్మికి గొబ్బిళ్ళు
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో కొండాలయ్యకు గొబ్బిళ్ళు
ఆదీలక్ష్మి అలమేలమ్మకు అందామైన గొబ్బిళ్ళు
గొబ్బిసుబ్బమ్మా సుబ్బణ్ణీయవే
చామంతిపూవంటి చెల్లెల్నీయవే
గొబ్బిసుబ్బమ్మా సుబ్బణ్ణీయవే
చామంతిపూవంటి చెల్లెల్నీయవే
తామరపూవంటి తమ్ముణ్ణీయవే
బంతి పూవంటి బావనీయవే
తామరపూవంటి తమ్ముణ్ణీయవే
బంతి పూవంటి బావనీయవే
మొగలిరేకంటి.....
మొగలిరేకంటి.....
మొగలిరేకంటి.....