May 29, 2022

చెలికాడే చెంతచేరగా....


చెలికాడే చెంతచేరగా....
గంగూబాయి కతియావాడి (2022)
సంగీతం: సంజయ్ లీలా భన్సాలీ 
రచన: చైతన్య ప్రసాద్ 
గానం: దీప్తి పార్థసారథి

పల్లవి:

చెలికాడే చెంతచేరగా
నా వదనమే మారే చందమామగా 
చెలికాడే... చెంతచేరగా
నా వదనమే మారే చందమామగా 

తలపై మోస్తూ నిందల బరువే 
తన సన్నిధినే... మురిసానుగా 

చరణం 1:

ద్వారాలన్నీ గోడలు వాకిలి 
బంధుగణమై తోడు ఆయే 
ప్రశ్నలు వేసే ప్రాణము తీసే 
ఎన్నని చెబుతా ఒక్క దాన్నే 
పనేమీ లేక కూర్చునుంటే 
చేయి నిండుగ దొరికే 
పనులే నేడిలా 

చరణం 2:

ఇది నా అందము చూసే తీరిక 
మరి నాకే లభించదులే 
ఆతని వలపుల కాంతికి 
జడిసే దీపం జ్వలించదులే
నాలో గర్వమింకి పోదే
నను నిలేసినా 
నిందలు వేసినా