March 12, 2022

మోగుతున్నాయి గాజులు


మోగుతున్నాయి గాజులు 
శ్రీదేవి (హిందీ చాందిని) 1990
సంగీతం: శివ్-హరి 
గానం: లతా మంగేష్కర్

పల్లవి: 

మోగుతున్నాయి గాజులు నా చేతిలో 
చాలు చాలు ఈ అల్లరిక ఇంతటితో 
ఇలానైతే ఎలాగంటా 
ఇదేందీ ఆగడాలు   

చరణం 1:

ఆపు ఆపు ఈవేళ ఈ చిందులాట 
నడిరేయి ఈ సందడేల ఈచోట 

వేగలేనోయి నీతో ఇక చిన్నవాఁడా
వేకువైనా నన్నొదలవు వన్నెకాడా 
అదే కాదా... అసలు బాధ... 
వయ్యారి అందగాడా 

చరణం 2:

రాలుగాయి కుర్రాళ్ళే నన్నే చేరేరే 
ఇలా లేచి నా వెంటపడి తిరిగేరే  

ఏదో రోజు ఇలా వాళ్ళు ఎలాగూ ఎక్కువౌతారు 

ఆ నాగుపామల్లే నా జడ ఆడింది 
నా నీలి కళ్ళల్లో ఈడు రేగింది 

నాగుపామల్లే నా జడ ఆడింది
నీలి కళ్ళల్లో ఈడు గోలచేస్తోంది  
వయ్యారాల వికారాలు భరించలేను నేను  

చరణం 3:

నేడు దర్జీకి నాకూ పెద్ద రగడే జరిగింది 
నిన్న అతగాడు కుట్టిన రైక బిగుతైపోయింది 

అలాగంటే ఎలా తల్లీ ఇవాళే ఈడు వచ్చింది 

పక్కకొచ్చి నీ ఆశ నాతో చెప్పలేక 
నువ్వు రాశావు కాదా ఓ ప్రేమలేఖ 
అయ్యోరామా నన్నీవేళ బజారుకి లాగేవు 

అమ్మా ఓయమ్మా చిలకమ్మా చిట్టెమ్మా