January 14, 2022

కేరింత ఊరింత


చిత్రం : మైఖేల్ మదన కామరాజు (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

పల్లవి: 

ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం

గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నవి అన్నది చిన్నది అమ్మమ్మమ్మ

కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం

అహ ఈ పొద్దు ఏపొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీకోసం

చరణం 1:

ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ... సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ... రేగనీ
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ... సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ... రేగనీ
ఉరకాలి సింగారం ఒలికించాలి ఒయ్యారం
నీకేల సందేహమే హొయ్ ఇక నీదేగా సంతోషమే

పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగా హత్తుకో అబ్బబ్బబ్బ

చరణం 2:

అల్లరిప్రియుడే చక్కని కృష్ణుడై గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే

అల్లరిప్రియుడే చక్కని కృష్ణుడై గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే

కళ్యాణం కాకుండా... మన కచ్చేరి సరికాదు
చెయ్యడ్డుగా పెడితే... హోయ్ గోదారి ఆగిపోదు

చెప్పకామాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బ