ఆకాశాన ఇల్లు కట్టి
హెచ్చరిక (1986)
రచన: ఆత్రేయ
సంగీతం: శివాజీ రాజా
గానం: బాలు
పల్లవి :
ఆకాశాన ఇల్లు కట్టి
పగలే జాబిల్లని దీపమెట్టి
చుక్కల చీర చక్కగ చుట్టి
వేచి యుంటిని
చరణం 1:
మంచు చుక్కనై కురిసి
మమతల మల్లెమొగ్గనై విరిసి
నీ నవ్వునై నీ పువ్వునై
మేలుకుంటిని
మెలకువలో కలలు కంటిని
చరణం 2:
మెరుపుతీగనై మెరిసి
మదిలో మధురరాగమై వెలసి
నీ కళ్ళలో నా పల్లవి
అల్లుకుంటిని
పల్లవితో ఆగిపోతిని