ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా
చిత్రం : వజ్రాయుధం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఆ....
ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా
ఆ చల్లకొచ్చి ముంతదాచుడేందబ్బా
చూడగానే తాపమాయే
ఎండలోన దీపమాయే
రెప్పకొట్టి గిల్లమాక
రెచ్చగొట్టి వెళ్ళామాక
రేపుదాక ఆగలేనులే
(గూటికొచ్చి ఉండమాక
గుండె గోడు పెంచమాక
జాగు ఇంక ఓపలేనులే )
నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బా
ఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బా
గుమ్మ ఈడు తాపమాయే
గుండెలోన తాళమాయే
దగ్గరుంటె దప్పికాయే
పక్కనుంటె ఆకలాయే
చరణం 1:
ఎంతసిగ్గు పుట్టుకొచ్చె చెంపతాకితే
చెంపమొగ్గలేసుకొచ్చె చెయ్యితాకితే
యాడముట్టుకుంటే ఏది పుట్టుకొస్తదో
పుట్టుకొచ్చి ఏది పుట్టి ముంచిపోతదో
(నాడి పట్టి చూస్తె వేడి పుట్టుకొస్తదో
ఈడు కాస్త సొమ్మసిల్లి వాలిపోతదో)
అబ్బా...ఆగబ్బా
అబ్బా...ఉండబ్బా
చిన్న ముద్దబ్బా...హహ
ఇప్పుడొద్దబ్బా...హా..
ఆపుతున్నకొద్ది అగ్గిమంటబ్బా.
అంటుకున్నదంటె పెద్దతంటబ్బా
చెంగుపట్టి లాగగానే చీరకట్టు జారిపోయే
ఉన్న గుట్టు ఊరుదాటెరా
(నువ్వు నన్ను చూస్తె అందమంటబ్బా
మాపటేలకొస్తె నీకు జంటబ్బా
చెంగుపట్టి లాగగానే చెంప ఎర్రమొగ్గలేసే
ఊయలల్లే ఊగులాడెరా)
చరణం 2:
ఈడు వేడిఎక్కిపోయె ఏడ తాకినా
నీరుకాస్త ఆవిరాయే నీడతాకినా
నిన్నుముట్టుకుంటె గుండెగంటకొట్టెనే
ఒంటిగున్న లోకమంత జంటకట్టెనే
అబ్బా... తప్పబ్బా..హ
తప్పే...ఒప్పబ్బా
ఒప్పుకోనబ్బా
ఒక్కసారబ్బా
ఎప్పుడంటె అప్పుడైతె ఎట్టబ్బా
గుట్టుమట్టు చూసుకోవు ఏందబ్బా
చుక్కపూల పక్కమీద జున్నుపాల పొంగులైతె
మల్లెపువ్వు మాటతప్పునా