May 13, 2022

ఇంత అందమైన అమ్మాయిని దేవుడా


చిత్రం: సీమ శాస్త్రి (2007)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్

పల్లవి: 

ప్రియతమా...
ప్రియతమా...
ఇంత అందమైన అమ్మాయిని... 
ఇంత అందమైన అమ్మాయిని... 
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
ఎట్టా తలచినావో, మలచినావో దేవుడా
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
నేను ఇంతకాలం చూడలేదు దేవుడా

అయస్కాంతమేదో తన చూపుల్లో దాగుంది
తనవైపే లాగేస్తూ ఉందే
నా మనసే ఆగదు ఏ భాషైనా చాలదు
తన రూపం వర్ణిస్తూ ఉంటే
హరివిల్లును బొమ్మగ చేసి 
అణువణువు వెన్నెల పోసి 
నాకోసం పుట్టించావేమో
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
ఎట్టా తలచినావో మలచినావో దేవుడా

చరణం 1:

తను సన్నగా నవ్వితే ముత్యాలవాన
ఆ వానలో తడవాలే మైనా
నడుమొంపులో ఉన్నది వయ్యార వీణ
ఆ వీణలో రాగాన్నైపోనా
అమ్మాయి ఊరేంటో తన ముద్దుపేరేంటో తన ఇష్టాలేంటేంటో.....

చెలినే తలచి, పనులే విడిచి, రేయి పగలు తన ఊహలతో
ఇదివరకెరగని అలజడి మొదలై
తడవ తడవకి తడబడి పొరబడి
కలవరపడుతూ కలలే కంటూ
కునుకే రాదు కుదురే లేదు
ప్రియతమా.........ప్రియతమా

చరణం 2:

తను అడిగితే ఇవ్వనా నా ప్రాణమైనా
నా సర్వము తనదే అంటున్నా
కనుపాపని కాపాడే కనురెప్పలాగా
చెలి తోడుగా నూరేళ్ళుంటాగా
ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలి

ఎపుడూ లేదే ఎదలో గుబులు నిను చూసాక సెగలే మొదలు
కదలదు సమయం క్షణమొక యుగమై
కనులు తెరవగా ఎదురుగ నిలబడి
చేతులు చాచి రమ్మని పిలిచి
అందీ అందక ఊరిస్తావే
ప్రియతమా... ప్రియతమా