March 11, 2022

నీవు నేను ఊహల్లో


నీవు నేను ఊహల్లో 
శ్రీదేవి (హిందీ చాందిని) 1990
సంగీతం: శివ్-హరి 
గానం: లతా మంగేష్కర్, బాలు 

పల్లవి: 

నీవు నేను ఊహల్లో
పదే పదే ఆలపించనీ  
నీలో నాలో సరాగం 
సుమాలుగా పల్లవించనీ 

చరణం 1:

మదిలో మెరిసే ప్రేమకీ  
మమతనేది గురుతుంటుంది 

మురిపించే ఈ చోటుకీ 
మన కలయిక గురుతుంటుంది

ఇలాగే సాగేనులే 
నేనే నీకు తోడునీడ లే 

నీలో నాలో సరాగం 
సుమాలుగా పల్లవించనీ 

చరణం 2:

కళ్ళల్లో నీవుండవాఁ  
కల నీవై పలకరించవా 

నీలోనే నేనుంటే... 
మాటాడే దెట్టాగంటా

ఇలా ఇలా మాటల్తో 
నన్నే నువ్వే దోచుకుంటివే 

నీలో నాలో సరాగం 
సుమాలుగా పల్లవించనీ 

చరణం 3:

నే పాడే పాటలకు 
పల్లవి నీవే కాదా 

ఎనలేని నా ప్రేమకే 
శ్రీకారం నీవే కదా 

వసంతాల నీ పిలుపే 
రోజూ నాకు మేలుకొలుపే 

నీలో నాలో సరాగం 
సుమాలుగా పల్లవించనీ