నగరాలకు తలనగరమిది
శ్రీదేవి (హిందీ చాందిని) 1990
సంగీతం: శివ్-హరి
గానం: లతా మంగేష్కర్, బాలు
పల్లవి:
శ్రీదేవి....శ్రీదేవి
నగరాలకు తలనగరమిది
హొయ్ దీనికి పేరే ఢిల్లీ
ఈ నగరంలో కలిసెను నాకు
శ్రీదేవను సిరిమల్లి
వెన్నెల కురిసే కన్నులలో చిక్కుకున్నా చూడు
బంధాలే వేసే
నను గారడి చేసే
నువ్వే నా ప్రేయసివే
నువ్వే నా ప్రేయసివే
నువ్వే నా ప్రేయసివే
శ్రీదేవి....
చరణం 1:
నన్నే నువ్వు చూస్తుంటే
తొలిచూపున కథ తెలిసింది
నువ్వే నా చెలికాడివనీ
మనసే నాతో తెలిపింది
స్వప్నజగాలలో ఎవ్వరికై
నే వెతికేనో నా తోడు
అది నువ్వేనంటా
అది నిజమేనంటా
నేనే నీ ప్రేయసిని
నేనే నీ ప్రేయసిని
నేనే నీ ప్రేయసిని
చరణం 2:
ఊ అంటే మనసిస్తానే
ఏడడుగులు నడిపిస్తానే
దేవుడు కలిపిన జంట ఇది
తీయని కలల పంట ఇది
మన ఇద్దరి బంధం నడుమ
లేనేలేరు ఎవ్వరూ
నచ్చానే నిన్నూ
మెచ్చానే నేను
నువ్వే నా ప్రేయసివే
నేనే నీ ప్రేయసిని