May 29, 2022

మనసా వాచా కర్మణ

మనసా వాచా కర్మణ

చిత్రం: సీమ శాస్త్రి (2007)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కారుణ్య, సుచిత్ర 

పల్లవి:

మనసా వాచా కర్మణ నిను ప్రేమించా 
నా మనసనె ఢిల్లీ కోటకి నిన్నే రాణిని చేశా  
కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా... 
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దొరా

కదిలే వెన్నెల శిల్పం నీవని కన్నుల కొలువుంచా 
కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలచా 

మదనుడు పంపిన వరుడే నువ్వని మనవే పంపించా...
నా మనసే అర్పించా... 

చరణం 1:

దిక్కులు నాలుగనీ అందరు అంటున్నా 
కాదు ఒకటేననీ నిన్నే చూపిస్తా 

ప్రాణాలైదు అనీ ఎందరు చెబుతున్నా 
ఒకటే ప్రాణమనీ మననే చూపిస్తా 

ఎన్నడు వాడని ప్రేమకు ఋతువులు ఆరే కాదమ్మా 
జంటగ సాగుతు పెళ్ళికి నేడే అడుగులు వేద్దామా?

అష్టైశ్వర్యం మనకందించే వరమే ఈ ప్రేమ    
ప్రేమకు మనమే చిరునామా... 

చరణం 2:

కన్నులు ఉన్నవిలా నిను చూసేటందుకులే 
నా కంటికి వెలుతురులా నువ్వుంటే చాల్లే 

పెదవులు ఉన్నవిలా నిను పిలిచేటందుకులే 
ఆ పిలిచే పేరొకటీ నీదైతే చాల్లే 

పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే 
అందం ఉన్నది నీ కౌగిట్లో అలిసేటందుకులే 

హృదయం ఉన్నది నిన్నే తనలో దాచేటందుకులే 

అది ఇక సొంతం నాకే