November 23, 2022

ఇది ఆదిమానవుడి ఆరాటం



ఇది ఆదిమానవుడి ఆరాటం 
చిత్రం: పోరాటం (1983)
సంగీతం: చక్రవర్తి 
రచన: రాజశ్రీ
గానం: బాలు 

పల్లవి:

ఇది ఆదిమానవుడి ఆరాటం 
ఆ దైవంతోనే చెలగాటం 
విధి ఆడే ఈ చదరంగంలో 
జీవితమే ఓ పోరాటం 
ఇది జీవనపోరాటం... 
ఇది జీవనపోరాటం... 

చరణం 1:

తొమ్మిది నెలల ఆరాటం 
అమ్మ ఇచ్చిన ఆకారం 
తొమ్మిది నెలల ఆరాటం 
అమ్మ ఇచ్చిన ఆకారం 
ఉగ్గుపాలతో ఊయలజోలా... 
నిన్ను పెంచిన మమకారం 
నిలకడ కోసం....మనుగడ కోసం 
నిలకడ కోసం....మనుగడ కోసం 
బ్రతుకే ఓ పోరాటం
అదే... అదే... జీవనపోరాటం

చరణం 2:

చిగురించే నీ అనురాగం 
పెదవికి ముద్దుల పేరంటం 
చిగురించే నీ అనురాగం 
పెదవికి ముద్దుల పేరంటం 
మూడుముళ్ళతో సాగరయాత్ర 
నీకు మిగిలినా సంసారం 
బాధ్యత కోసం బరువులు మోసే 
బాధ్యత కోసం బరువులు మోసే
బ్రతుకే ఓ పోరాటం
అదే... అదే...జీవనపోరాటం