అద్దంకి చీరలో..
చిత్రం: వజ్రాయుధం (1985)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, సుశీల
పల్లవి:
అహ అహ అద్దంకి చీరలో..
ముద్దంటి చిన్నది..
అరె అద్దంకి చీరలో..
ముద్దంటి చిన్నది..
అద్దాల రైకలో ఎదురొస్తుంటే
దానిమ్మచెక్క పులుపెక్కెనే..
ఓ యమ్మ తిక్క తలకెక్కెనే..
అరెరె అద్దంకి వాడలో..
ముద్దొచ్చే పిల్లడు..
అద్దంకి వాడలో..
ముద్దొచ్చే పిల్లడు..
వద్దన్నా వయసులా వచ్చేస్తుంటే..
ఆ నింగి చుక్క ఎరుపెక్కెనే..
నా పూలపక్క ఏడెక్కెనే..