తవమాం ద్రష్టుమ్ దయాస్తివా
అన్నమయ్య స్వర లతార్చన (2010)
గానం: లతా మంగేష్కర్
సంగీతం: మయూరేశ్ పాయ్
పల్లవి:
తవమాం ద్రష్టుమ్ దయాస్తివా
(స్వామీ తమ దయగల చూపు మాపై ఉన్నదా?)
త్రివిధైర్ఘనాని తే నామాని
చరణం 1:
కర రమణీ కంకణైర్ఘణ కుచ
(ముంజేతి మణికంకణములు గల పడతి తన ఎత్తయిన ఎదలకు హత్తుకుని)
గిరౌ స్థాపిత కిన్నరీయం
(కిన్నెరను ఎదకు హత్తుకుని నీ నామమునే పలికించుచున్నది)
సరసం మ్లేఛ్చ రచనాని త్వయి
(తాదాత్మ్యములో ఏవో మాకు అర్థముకాని అన్యభాషలో నిన్ను కీర్తిస్తున్నది)
స్థిరా నదయతి తే నామాని
(స్థిరముగ నీ నామములే కిన్నెరపై వాయిస్తూ పరవశము చెందుచున్నది)
చరణం 2:
కలరవ కంపిత కంఠ విలసనం
(మృదువైన పావురము వంటి వణుకుతున్న గొంతుతో ఆమె కంఠము మిణుకుమిణుకుగా ప్రకాశిస్తుంది)
కిల కిల మేళన కిన్నరీయం
(తన సన్ననైన గాత్రమును కిన్నెర నాదముతో మేళవించి పాడుతుంది)
లలనా కావా లంఘిత వాద్యం
(ఈ లలనామణి ఎవరయ్యా...!? నీ నామములను కిన్నెరతో వాయిస్తూ సాగిపోతున్నది)
తిలకయతి తదా తే నామాని
(అలా సాగిపోతున్న ఆమె నీ నామములనే ధరించియున్నదిగా నిన్ను దర్శింపచేయుచున్నది)
చరణం 3:
నిరత మూర్ఛనా నిబిడ తాళ రవ
(అన్ని హెచ్చుతగ్గుల స్వరములతో సదా లయతాళముల ధ్వనులను కలుపుచూ)
గిరాయోజిత కిన్నరీయం
(తన గొంతుకను ఆ కిన్నెరతో కలిపి చేర్చి పాడుచున్నది)
తరుణీ రణయతి తదా సమీపే
(ఇంకో తరుణీమణి కూడా ఆమెకు ప్రతిధ్వనిగా, నీ సమీపముననే ఉండి, వంతపాడుతున్నది స్వామీ )
తిరు వేంకట వర తే నామాని !!
(ఓ తిరువేంకటగిరి వరదుడా....! నీ నామములే ఈ తరుణీమణులు పాడుతున్నారయ్యా...)
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా
గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా