November 20, 2022

సన్నజాజి పక్కమీద సంకురాత్రి



సన్నజాజి పక్కమీద సంకురాత్రి
చిత్రం: వజ్రాయుధం (1985)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

పల్లవి: 

సన్నజాజి పక్కమీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటిరాత్రి
పెదవులు అడిగిన రుచిరాత్రి
కౌగిలి అడిగిన కసిరాత్రి
కవ్విస్తున్నది చలిరాత్రి
కవ్విస్తున్నది చలిరాత్రి

చరణం 1:  

పాలు పట్టుకొచ్చాను.. పంచదార వేసుకో
పండు పట్టుకొచ్చాను.. పక్కకొచ్చి పంచుకో
పాలు పంచుకుంటాను పడుచందము
పండించుకుంటాను పట్టెమంచము
సద్దు చెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
సద్దు చెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
హద్దు చెరుపుకో తొలిరాత్రి...తొలిరాత్రి

చరణం 2:

తెల్లచీర తెచ్చాను.. తెల్లవార్లు కట్టుకో
మల్లెపూలు తెచ్చాను.. మంచమంత జల్లుకో
చిందిపడ్డ తేనెలన్ని నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి నువ్వు పండుకో
రతికే తెలియని రసరాత్రి
శృతిలే కలిసిన సుఖరాత్రి
రతికే తెలియని రసరాత్రి
శృతిలే కలిసిన సుఖరాత్రి
ఎరగని వాళ్లకి యమరాత్రి యమరాత్రి